ప్రజాకూటమి గెలుపు రాష్ట్రానికి మలుపు:  చంద్రబాబు

“కేంద్రం అన్యాయం చేసినా తెలుగుజాతిగా కలిసి పనిచేద్దాం అంటే కేసీఆర్ కలిసి రాకపోగా, మోదీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క మంచి పనిచేయలేక ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు” అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. 

అన్ని వనరులున్నా సమర్థవంతమైన నాయకత్వం లేక తెలంగాణ రాష్ట్రం నేడు సమస్యలు ఎదుర్కొంటోందనీ, . ఇబ్బందులు పడుతోందనీ, అందుకే టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని, సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజాకూటమికి మద్దతిస్తున్నాము అన్నారాయన.

ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తూ పల్లకీ మోస్తున్నారంటే.. కారణం కేవలం ప్రజలేననీ,  పదవులు ఆశించకుండా ప్రజలకు మేలు జరగాలని శ్రమిస్తున్నారనీ, కూటమి గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని పాటుపడుతున్నారు అంటూ సందేశాన్ని ట్విట్టర్ ద్వార అందించారు చంద్రబాబు .