మ్యజికల్ మ్యూజికల్ శర్వానంద్-సాయి పల్లవి “పడి పడి లేచె మనసు”

Image removed.

ఫిదా సినిమా తో తన మాజిక్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్న సాయి పల్లవి ‘పడి పడి లేచె మనసు” చిత్రంతో మళ్ళీ మన ముందుకు వస్తోంది.   హను రాఘవపూడి దర్శకత్వం లో శర్వానంద్ హీరో గా, సాయి పల్లవి జంటగా నటించిన 'పడిపడి లేచే మనసు' డిసెంబర్ 21 న మన ముందుకురానుంది.   ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ ను ఇంతకుముందే విడుదల చేయగా, ఆ పాత వీడియో ను విడుదల చేసింది చిత్ర బృందం.  ఈ పాట ను హిమాలయాలలోని స్పితి వ్యాలీ లోని అందమైన లొకేషన్స్ లో సాయి పల్లవి శర్వానంద్ ల మధ్య రొమాంటిక్ గా చిత్రీకరించారు.  ఈ పాటలో హీరో, హీరొయిన్ ల కెమిస్ట్రీ, హావ భావాలు, ఆ లొకేషన్స్ కు మరింత అందాన్ని తెచ్చాయి.  విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించగా అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ ఈ గీతాన్ని ఆలపించారు.  మీరు కూడా ఈ పాటతో ప్రేమలో పడండి...