
జూనియర్ ఎన్ టి ఆర్ కెరీర్ లో ఓ ప్రత్యేక చిత్రం ‘టెంపర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ కు మంచి పేరుని తెచ్చింది. ఒక లంచగొండి పోలిస్ గా మొదలై..తర్వాత తన తప్పు తెలుసుకుని, మంచి పోలిస్ గా మారే పాత్ర లో ఎన్టీఆర్ నటన అద్భుతం. చిత్ర కథాంశం లో హీరో పాత్రకి డిఫరెంట్ షేడ్స్ ఉండడంతో చిత్రాన్ని హిందీలోను, తమిళ్ లో ను రీమేక్ చేస్తున్నారు. హిందీ లో 'సింబ' గా రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా, తమిళ్ లో పందెం కోడి ఫేం విశాల్ నటిస్తున్నాడు. హిందీ లో రణ్ వీర్ సింగ్ సరసన సారా అలీ ఖాన్ నటిస్తోంది. అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో నటించారు. రోహిత్ సెట్టి దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, రోహిథ్ శెట్టి నిర్మిస్తున్నారు.