కవళమ్మ లేఖ కల్వకుంట్ల వరకు!

శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నమస్కరించి వ్రాయునది! నాపేరు యంపల్ల కవళమ్మ ఊట్కూర్ గ్రామం.శాలిగౌరారం మండలం. నల్గొండ జిల్లా.నేను మహిళ రైతును నాకు 6ఎకరాల 20గుంటల 102,103 సర్వే నెంబర్ గల భూమి వుంది.అయితే నేను నా భూమిలోకి పోవడానికి బాట వుండేది. ఆ బాట నుండి పోవోదంట్టూ  నకేరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెందిన అతని సోదరులు వేముల రామచంద్రు,వేముల ఇద్దయ్య,వీరేశం డ్రైవర్ చిల్లేటి సాగర్,వీరేశం అనుచరులు,సోదరులు బాట పోవడానికి నాకు హక్కు లేదని లేకుంటే చంపుతామని బెదిరిస్తూ,డబ్బులు ఇవ్వాలని,మేము చెప్పినదే వినాలని  నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.

                     ఈ విషయమై సంవత్సర క్రితం నల్గొండ ఎస్సీకి,యంఆర్ఓ కి స్దానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా యంఆర్ఓ ఆరు నెలల క్రితం బాట విషయంమై  పంచాయితీ చేసిన స్దానిక రైతులు బాట వుందని చెప్పిన అధికార ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారంతో  వారి  అడ్డదండలతో  వారి అనుచరులు అధికారును బెదిరిస్తుండడంతో అధికారులు కూడా ఏమి  జరగనంటూ పట్టిచుకోకుండా వ్యవహరిస్తున్నారు. కావున ఎమ్మెల్యే,అతని సోదరులు,అనుచరుల నుండి నాకు ప్రాణ హాని వుంది.కావున ఈ విషయంలో మీరు నాకు న్యాయం చేయాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో నిరహర దీక్ష చేస్తానన్ని,ఇలా పేద రైతులు ఇబ్బంది పేడితే ఆత్మహత్యలే శరణ్యం తప్ప ఇలా జరగకుండా ఆ భూమి విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని నాయెుక్క విజ్డప్తి.ఈ యెుక్క సమచారం ముఖ్యమంత్రికి తెలిసేంత వరకు షేర్ చేయాలని కోరుతున్నాను.                               

                                                 ఇట్లు               

            యంపల్ల కవళమ్మ  గా,,ఊట్కూర్ మం,,శాలిగౌరారం జి,,నల్లగోండ.