"మళ్లీ వస్తున్న మోగ్లీ: ది లెజెండ్ అఫ్ జంగిల్ ట్రైలర్ విడుదల

2016 లో వచ్చిన జంగిల్ బుక్ చిత్రం లో మోగ్లీ అందరినీ అలరించాడు. ఇప్పుడు మరోసారి మోగ్లీ, మోగ్లీ: ది లెజండ్ అఫ్ జంగిల్ ద్వారా మళ్ళి మన ముందుకు వస్తున్నాడు.  దట్టమైన అడవులు, మాట్లాడే జంతువుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో మోగ్లీ కారక్టర్ అందరినీ ఆకర్షిస్తుంది.  ప్రముఖ ఆంగ్ల రచయిత రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ మోగ్లీ సృష్టికర్త  ‘ది జంగిల్‌ బుక్’ స్టోరీస్‌ సిరీస్‌ నుంచి రాబోతున్న మరో చిత్రం ‘మోగ్లీ: ది లెజండ్ ఆఫ్‌ జంగిల్’.   ఈ చిత్రానికి మరో హైలైట్ ఏంటంటే.. బాలివుడ్ దిగ్గజాలు ఈ చిత్రానికి తమ గాత్రాన్ని అందించటమే.. భల్లూకానికి అనిల్‌ కపూర్‌, కొండచిలువకు కరీనా కపూర్‌, తోడేలుకు మాధురీ దీక్షిత్‌, పులికి జాకీ ష్రాఫ్‌, చిరుతకు అభిషేక్‌ బచ్చన్‌ గాత్రం అందించగా మోగ్లీ పాత్రలో రోహన్‌ చాంద్ నటించాడు. 

 

అడవిలో కొన్ని తోడేళ్ళు మోగ్లీ ని పెంచి పెద్ద చేస్తాయి.  అడవిలో జంతువులతో స్నేహం చేస్తున్నమోగ్లీ ని జంతువుల్లో కలిసి ఉండలేవని, మనుషులతో పాటు కలిసి ఉండమనీ అడవిలోని జంతువులన్నీ చెప్తాయి.  ఆ మాట ప్రకారం, మోగ్లీ అడవి దగ్గరలో వున్న గ్రామ ప్రజలతో కలిసిపోతాడు. కాలాణుగునంగా కొందరు మనుషులు అడవిలోని జంతువులను చంపేయాలని చూస్తుంటారు. అప్పుడు ఆ జంతువులన్నీ తమకు సాయం చేయాలని భగీరాను కోరతాయి. మరి భగీరా వాటికి సహాయం చేసాడా?  జంతువులన్నీ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాయా తేలియాలంటే డిసెంబర్ 7 న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ షో గా విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని చూడాల్సిందే.  తెలుగు, తమిళం, హిందీలో ఈ చిత్రం థియేటర్లలో 2019 లో విడుదల కాబోతోంది.