జ‌గ‌న్ అరెస్టుపై లక్ష్మీనారాయ‌ణ క్లారిటీ!

తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ల‌క్ష్మీనారాయ‌ణ ఆ ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌గ‌న్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజ‌రుప‌రిచామ‌ని, త‌న‌పై ఎటువంటి రాజ‌కీయ ఒత్తిడులు లేద‌ని లక్ష్మీనారాయ‌ణ స్పష్టం చేశారు. ఆ మాట‌కొస్తే తాను జ‌గ‌న్ కేసు విచార‌ణ‌కు రాక ముందే సీబీఐ విభాగంలో డీజీపీగా విధులు నిర్వ‌హిస్తున్నాన‌ని చెప్పారు. ఆ ఇంట‌ర్వ్యూలో లక్ష్మీనారాయ‌ణ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. 

నిబంధనల ప్రకారం పై అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే నాడు జగన్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్టు చేసిన 24 గంటల లోపే ఆయ‌న‌ను కోర్టులో హాజరుపరిచామన్నారు. ఒక్క జ‌గ‌న్ విష‌యంలోనే కాద‌ని ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల్లో అరెస్ట‌యిన వారిని 24 గంట‌ల‌లోపు కోర్టులో హాజ‌రుప‌రుస్తామ‌ని, అది త‌మ విధినిర్వ‌హణలో భాగ‌మ‌ని ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. జ‌గన్ విష‌యంలో కూడా కోర్టు తాము దాఖ‌లు చేసిన వివ‌రాలు, సాక్ష్యాధారాల‌ను ప‌రిశీలించి సరైనవేనని నిర్ధారించిందని తెలిపారు. జ‌గ‌న్ కేసు కోసమే త‌న‌ను ప్ర‌త్యేకంగా య‌మించార‌న్న వ‌దంతుల్లో వాస్త‌వం లేద‌న్నారు. 

2006లోనే తాను హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకి డీజీపీగా బదిలీపై వచ్చానని, 2011లో జ‌గ‌న్ కేసు తన ద‌గ్గ‌ర‌కు వచ్చిందని తెలిపారు.త‌మ‌కు ల‌భించిన సాక్ష్యా ధారాలను బ‌ట్టే విచారణ జరిపామని, నిబంధనలకు విరుద్ధంగా వ‌హ‌రించ‌లేద‌ని అన్నారు.