గుంటూరు జిల్లాలో కిడ్నీ రాకెట్‌

గుంటూరు జిల్లాలో మరోసారి కిడ్ని రాకెటు వెలుగుచూసింది. గుంటూరు వేదాంత ప్రైవేట్‌ హాస్పిటల్‌ చికిత్స అందిస్తున్నా వ్యక్తికి రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి సిబ్బంది కిడ్నీలు తామే మారుస్తామని రోగికి చెప్పారు. ఈ మేరకు వెంకటేశ్వర నాయక్‌ అనే వ్యక్తిని సమీప బంధువుగా ఆధార్‌ కార్డుల్లో మార్పు చేశారు. నాయక్‌కు కొంత మేర డబ్బులు కూడా చెల్లించారు. తహశీల్దార్‌ పిర్యాదు మేరకు పోలీస్‌ అధికారులు విచారణ చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిఎస్‌ తెలిపారు.