యాదాద్రిలో కూలిన మరో శిక్షణ విమానం.

గత వారం జరిగిన శిక్షణ విమాన దుర్ఘటన ను మర్చిపోకముందే తెలంగాణా రాష్ట్రంలోని యదాద్రి-భువనగిరి జిల్లాలో మరో శిక్షణ విమానం కూలిపోయింది. యాదాద్రి జిల్లాలోని బాహుపేట శివారులో జరిగిన సైనిక శిక్షణ విమాన ప్రమాదంలో పైలట్‌కు తీవ్రగాయాలయ్యాయి. మధ్యాహ్నం 12గం సమయంలో ఓ సైనిక శిక్షణ విమానం పెద్ద శబ్దంతో బాహుపేట శివారులోని ఓ వెంచర్‌లో కూలిపోయిందానీ పోలీసులు తెలిపారు.  పైలట్ యోగేష్ యాదవ్ చాకచక్యంగా ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి పారాచ్యూట్‌‌ సాయంతో కిందికి దూకడంతో ప్రాణాపాయం తప్పింది, గాయాలతో బయటపడ్డారు.  పైలట్ శిక్షణలో భాగంగా హకీమ్ పేట ఎయిర్ ఫోర్సు స్టేషన్ నించి నింగికి ఎగిరిన కిరణ్ ఎయిర్ క్రాఫ్ట్, క్రాష్ అయిందనీ, ఈ ఘటన పై విచారణ చేపడుతున్నామనీ ఇండియన్ ఎయిర్ ఫోర్సు అధికారి అనుపం బెనర్జీ తెలిపారు.  విషయం తెలిసిన వెంటనే సైనికాధికారులు హెలికాప్టర్‌లో వైద్య సిబ్బందిని ఘటనాస్థలికి పంపించారు. పైలట్‌కు‌ ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు.

Image removed.