థగ్స్ (డడ్స్) అఫ్ హిందుస్థాన్

యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ తారాగణంతో, అత్యంత భారీ బడ్జెట్‌ తో నిర్మించిన చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. తొలిసారిగా బాలీవుడ్ అగ్రకథానాయకులు బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌‌, ఆమిర్‌ ఖాన్‌‌ తో పాటు గ్లామర్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరిగాయి. దాదాపు రూ. ౩౦౦ కోట్లతో అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, భారీ సెట్టింగ్స్ తో, కళ్ళు చేదిరీ పోరాట సన్నివేశాలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.   ఈ సినిమా కోసం వేసిన సెట్స్ లో 2 భారీ షిప్స్ ను డిజైన్ చేసారు, వెయ్యి మందికి పైగా కార్మికులు పని చేసారు.  డిజిటల్ మరియు సాటిలైట్ బిజినెస్ పరంగా కూడా 140 కోట్లు సాధించి విడుదలకు ముందే సంచలనం సృష్టించింది.  ఈ చిత్రానికి ధూమ్ ౩ లాంటి సూపర్ హిట్ చిత్రానికి పనిచేసిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించగా, అమితాబ్, ఆమిర్ ఖాన్ తొలి సారి కలిసి నటించారు.  ఇంత భారీ  బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా వుందో, ఎ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దామా.  

స్టొరీ:

“థగ్స్ అఫ్ హిందూస్తాన్” చిత్రం బ్యాక్ డ్రాప్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించే రోజులకు సంభందించింది.  1795లో ఈస్ట్ ఇండియా కంపెనీని “థగ్స్” అని పిలువబడే తన గ్యాంగ్ తో ఖుదాబక్స్ (అమితాబ్) దేశవ్యాప్తంగా దారి దోపిడీలతో గడగడ లాడిస్తుంటాడు.  బ్రిటిష్‌ ఖజానాను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో కపట బ్రిటిష్ ప్రభుత్వం థగ్స్ ను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా చిన్న చిన్న దొంగతనాలు చేసే ఫిరంగి (ఆమిర్ ఖాన్) ని ఖుదా బక్ష్ ని, అతని గ్యాంగ్ ఐన కత్రినా కైఫ్, ఫాతిమా షేఖ్ ని అంతం చేయడానికి నియమిస్తుంది.  ఫిరంగి బ్రిటిష్ కంపెనీ కి నిజాయితిగా పనిచేసాడా, లేక ఈస్ట్ ఇండియా కంపెనీ ని ఎదిరించాడా?  ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమేయడానికి థగ్స్‌ ఏం చేశారు? అనేది వెండితెరఫై చూడాల్సిందే. 

 

ప్రదర్శనలు:

ప్రథమార్థం లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి.  ద్వితీయార్ధానికి ముందుకు వచ్చే ట్విస్ట్‌ బాగుంటుంది.  స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల ద్వితీయార్ధంలో కొన్ని చోట్ల వచ్చే సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి.   అంతే కాక 2 గంటల 45 నిమిషాల చిత్ర నిడివి కూడా ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది.  యష్ రాజ్ మూవీస్ లో వచ్చే ముజికల్ మాజిక్ మిస్ ఐంది. 

 

ప్రదర్శనలు:

నేపథ్య సంగీతం, సెట్స్‌, నిర్మాణ విలువలు బాగున్నాయి.  ఆమిర్ ఖాన్ మూవీస్ లో వుండే చక్కటి సంగీతం ఈ చిత్రం లో మిస్ అయ్యింది.    అమితాబ్ తన పవర్ఫుల్ డయలాగ్స్ తో, ఆమిర్ తన కామెడీ టైమింగ్ తో, ఇంగ్లీష్ తో ప్రేక్షకులను అలరిస్తారు.   చిత్రం చూస్తున్నత సేపూ మనకి హాలీవుడ్ మూవీ “పిరేట్స్ అఫ్ కరీబియన్” గుర్తుకు వస్తుంది.

 

Image removed.

 

ప్లస్ పాయింట్స్:

అమితాబ్, ఆమిర్ ఖాన్

భారీ సెట్స్

విసువల్ ఎఫెక్ట్స్

 

మైనస్ పాయింట్స్:

పేలవమైన స్క్రీన్ ప్లే

మిస్ ఐన లాజిక్

సుదీర్ఘ నిడివి

సంగీతం

 

రేటింగ్:

2.5/5