జీవిత కాలం లో వాచ్ ధరించని ఆపిల్ సృష్టికర్త –స్టీవ్ జాబ్స్

ప్రపంచ ఖ్యాతి చెందిన వ్యక్తుల వింత అలవాట్లు మనలని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి.  హెన్రీ ఫోర్డ్‌ - కార్ల కంపెనీ వ్యవస్థాపకుడు, హెన్రీ ఫోర్డ్ తినే డైట్ ఏంటో తెలుసా..కలుపు మొక్కల సాండ్విచ్..సాక్స్ వేసుకొని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్..  అయన ఎప్పుడూ సాక్స్ వేసుకోలేదట...ఎందుకంటే వాటిని వేసుకోవడం ఆయనకు అవసరం లేదు అనిపించదట.

 

ఆపిల్ కొన్నేళ్ళ క్రితం ఆపిల్ స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి విడుదల చేసింది... ఇందులో ఎన్నో ప్రత్యకతలున్నాయి.. పొరపాటున కిందపడి ప్రమాదానికి గురైతే వెంటనే గుర్తించి సమాచారం అందించడం, గుండె ఆరోగ్యాన్ని నిత్యం కనిపెట్టుకొని ఉండటం ఇలా ఎన్నో..అలాగే అత్యంత ప్రాచుర్యం పొందిన ఐ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్‌కు వాచ్‌ ధరించే అలవాటు లేదుట... ఆయన జీవితకాలంలో ఎప్పుడూ వాచ్‌ పెట్టుకోలేదు. యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌ కుమార్తె లిసా బ్రేన్నన్ ‘స్మాల్ ఫ్రై’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించింది.. ఓ సారి ఆయనను ‘నువ్వెందుకు అందరిలా ఖరీదైన వాచ్‌లు పెట్టుకోవు’ అని అయన కుమార్తె లిసా అడిగింది. దానికి ఆయన చెప్పిన సమాధానం విచిత్రంగా ఉంది.  అందుకు ఆయన సమాధానం...నాకు సమయానికి కట్టుబడి ఉండటం ఇష్టం లేదన్నారు.  ప్రతి సారి టైమ్‌ ఎంత అని వాచ్‌లోకి చూడటం కూడా వృథాగా భావించేవారట స్టీవ్‌.  

Image removed.