సెల్ఫి కింగ్ రియల్ మీ U1 విడుదల

Image removed.

చైనా కు చెందిన రియల్ మీ “U” సిరీస్ లో రియల్ మీ U1 అనే కొత్త మోడల్ మొబైల్ ను ఈ రోజు లాంచ్ చేసింది.  ఇటీవలే రియల్ మీ 2 ప్రో ని విడుదల చేసిన రియల్ మీ, బడ్జెట్ సిరీస్ లో U1 ని విడుదల చేయటం విశేషం.  ఈ ఫోనులో 25 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వుండటం విశేషం.  సేల్ఫీ ప్రో మొబైల్ గా దీన్ని విడుదల చేస్తున్నారు.  అంతేకాక  మీడియా టెక్ హీలియో P70 చిప్ సెట్ తో విడుదలైన మొట్ట మొదటి ఫోన్ ఇది.  ఇప్పటివరకు విడుదలైన మోబిలేస్లో అత్యంత పవర్ఫుల్ చిప్ సెట్ ఇది.  స్టైల్-పవర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ U1 మొబైల్, హానర్, రెడ్ మీ వంటి బడ్జెట్ మొబైల్ సిరీస్ కు గట్టి పోటీ ని ఇస్తుంది.  ఫుల్ వ్యూ డ్యూ డ్రాప్ డిస్ప్లే తో లభించే ఈ ఫోన్ ను ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ద్వార పేస్ అన్ లాక్ ద్వార 0.1 సెకండ్స్ లో ఓపెన్ చేయవచ్చు. 

 

  • 6. 3 ఇంచ్ స్క్రీన్, FHD డిస్ప్లే
  • 3 జీబీ/4 జీబీ ర్యాం
  • 64/128 జిబీ ఇంటర్నల్ మెమరీ
  • 25 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
  • 13 ప్లస్ 2 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా
  • 2.1 Ghz ఆక్టా కోర్ హీలియో P70 ప్రాసెసర్.
  • 3200 mAh బాటరీ.
  • డ్యూయల్ సిం, డ్యూయల్ Volte,

 

అమెజాన్ లో ఫ్లాష్ సేల్ ద్వారా డిసెంబర్ 5 మధ్యహ్నం 12 గంటల నించి లభ్యం అవుతుంది. 

 

U1 3 gb/32 GB మోడల్  రూ.  11,999/- కాగా, 4 gb/64 GB మోడల్ రూ. 14,999/-