రాక్ స్టార్ దేవిశ్రీ పాటకి రాం చరణ్-కియారా తందానే-తందానే:

Image removed.

మెగా పవర్ స్టార్ రాం చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న వినయ విదేయ రామ జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.   బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతోన్న ఈ చిత్రం లో కథానాయికగా భరత్ అనే నేను ఫేం కియార అద్వాని నటిస్తోంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లోని ఒక పాటను డిసెంబర్ ౩ న విడుదల చేస్తున్నారు.  చెర్రీ-కియార ల జంటకు వీనుల విందైన రాక్ స్టార్ సంగీతం తోడైతే...అభిమానులకి పండగే.   ఇప్పటికే వినయ విదేయ రామ ఫస్ట్ లుక్, టీజర్ ఇంటర్నెట్ లో లక్షల వ్యూస్ తో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘‘తందానే తందానే’’ అంటూ సాగే ఫ్యామిలీ సాంగ్‌ని డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్‌ ద్వారా తెలిపారు. పోస్టర్ కూడా ఎంతో లైవ్లీ గా వుంది.. దానికి తోడు రాం చరణ్ శ్రీమతి కూడా ఈ పాట తాను విన్నాననీ...చాల బాగుందనీ ట్వీట్ చేసారు.