
తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం ఈ రోజుతో ముగుస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ప్రజలు ఎవరికి ఓటు వెయ్యాలన్నది ప్రకటిస్తామని ఇదివరకే ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ మేరకు తన సందేశాన్ని వీడియో ద్వార తెలియచేసారు. పోరా ట వీరుల స్ఫూర్తితో తెలంగాణ యువత స్వరాష్ట్రం సాధించుకుందన్నారు. ముందస్తు ఎన్నికలు రావడంతో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిందని అన్నారు. తెలంగాణ సాధించామని ఒకవైపు, , తెలంగాణ ఇచ్చామన్నవాళ్లు మరోవైపు ఉన్నారని.. ఎక్కువ పారదర్శకతతో, అవినీతిరహిత పాలన ఎవరు అందించగలరో వారికే ఓటు వేసి, తెలంగాణకు బలమైన ప్రభుత్వాన్ని అందించాలని కోరుతూ...జై తెలంగాణ.. జైహింద్ అంటూ పవన్ తన సందేశాన్ని ముగించారు.