త్రాగండి...గ్రీన్ టీ...

మీరు టీ తాగుతారా...అయితే ఇది మీకోసమె...టీ తాగకపోతే ఇప్పుడే మొదలు పెట్టండి..టీ తాగడం వల్ల  ఎన్నో ప్రయోజనాలను ఎన్నో పరిశోధనల్లో తేలింది...ఇప్పుడు తాజాగా చైనీసు పరిశోధకులు  కొత్త విషయాన్ని కనుక్కొన్నారు.  టీ తగదానికీ, ఎముకల సాంద్రత కి సంబంధం వుందని తెలుసుకున్నారు.  పెకింగ్ యూనివర్సిటీ లోని స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధనల ప్రకారం గత ౩౦ సంవత్సరాలుగా క్రమం తప్పకుండ గ్రీన్ టీ తగిన వారిలో ఎముకలు బలంగా వున్నట్లు కనుగొన్నారు. కాకపోతే.. ఈ రెండింటికి వున్న సంబంధం ఏమిటో కరెక్ట్ గా తేల్చలేక పాయినా, దీనికి కారణం గ్రీన్ టీ అని మాత్రం కనుక్కున్నారు.  చైనా కడూరీ బయోబాంక్ లోని 4,53, 625 మంది  హాస్పిటల్ రికార్డ్స్ స్టడీ చేసి, టీ తాగేవారికి, తాగని వారికి తొంటి ఎముక విరిగే శాతం 20% నించి ౩౦% తక్కువ అని గ్రహించారు.  మరింకేం...మీరూ గ్రీన్ టీ తాగండి...మీ ఎముకల బలాన్ని పెంచుకోండి...ఇప్పుడు ఎలాగు టీ టైం కదా..ఎంచక్కా గ్రీన్ టీ తాగండి...