
యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా కు 41 వ అధ్యక్షుడు, 43వ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ తండ్రి, 94 సంవత్సరాల జార్జ్ హర్బెర్ట్ వాకర్ బుష్ శుక్రవారం అర్దరాత్రి తుది శ్వాస విడిచారు. కాగా, జార్జ్ బుష్ భార్య, బార్బర బుష్ మరణించిన 8 నెలలకే బుష్ కూడా మరణించడం గమనార్హం. జార్జ్ బుష్ గత కొంతకాలంగా ఒక రకమైన పార్కిన్సన్ వ్యాధితో వీల్ చైర్ కే పరిమితమయ్యారు. బుష్ 40 సంవత్సరాలకు పైగా ప్రజాసేవలో వున్నారు. బుష్ మరణ వార్తను జార్జ్ బుష్ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. రెండు సార్లు ఉపాధ్యక్షుడు గాను, 1989-1993 వరకు అమెరికా అధ్యక్షుడు గాను బుష్ పదవీ బాధ్యతలు నిర్వహించారు. జార్జ్ బుష్ అధ్యక్షుడిగా వున్నా కాలంలో తన చొరవతో, రాజనీతిజ్ఞతతో 4 దశాబ్దాల ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారన్న ఖ్యాతి బుష్ సొంతం. బుష్ అనంతరం క్లింటన్ అధ్యక్ష పదవిని చేపట్టారు.
మేము ఎంతగానో ప్రేమించే మా నాన్న ఇక లేరని చెప్పడానికి, మేమంతా ఎంతగానో బాధ పడుతున్నాం. నాతోపాటు జెబ్, నీల్, మార్విన్, డారో దుఖ:సాగరంలో మునిగిపోయారు అంటూ జార్జ్ హర్బెర్ట్ వాకర్ బుష్ కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుష్ మృతికి తన సంతాపాన్ని తెలియచేసారు.