
అగ్రరాజ్యం అమెరికా వరుస భూకంపాలతో వణికింది. సునామీ హెచ్చరికలు, భూప్రకంపనాలు ప్రజలను భయభ్రాంతులను చేసాయి. అమెరికాలోని అంఖరేజ్, అలస్కా లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. కొద్ది నిమిషాల వ్యవధి లోనే 2 భూకంపాలు సంభవించడం తో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. అలస్కాలోని యాంకరేజ్ నగరానికి 11 మైళ్ల దూరంలో భూమికి 21 మైళ్ల లోతులో ఉదయం 8.౩౦ సమయం లో మొదటి భూకంపం సంభవించింది. మొదటి భూకంపం రిక్టర్ స్కేల్ పై 7 గా నమోదయ్యింది. అక్కడికి కొద్ది నిమిషాల వ్యవధిలోనే రిక్టర్‌స్కేల్‌పై 5.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదు. భారీ ఆస్థి నష్టం జరిగింది. అలస్కాలోని చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు కుంగిపోయాయి. జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. అలాస్కాలో భూకంపాలు సర్వసాధారణం. పెద్ద శబ్దంతో తమ ఇంట్లో గాజు కిటికీలు పగిలిపోయాయని, గత ౩౭ సంవత్సరాల్లోఇలాంటి భూకంపం ఇంతకుముందెన్నడూ చూడలేదనీ స్థానిక ప్రజలు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేసినా, తర్వాత ఉపసంహరించారు. మున్సిపల్ లైట్ అండ్ పవర్ యుటిలిటీ 10000 ఇళ్ళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అని తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నారు.