మహాభారతం లో కృష్ణుడి గా ఆమిర్ ఖాన్

పర్ఫేక్షనిస్ట్ ‘ఆమిర్ ఖాన్’ ఎ సినిమా చేసినా అది సంచలనమే..ప్రతి చిత్రం ఒక ఆణిముత్యంలా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.. సంవత్సరానికి ఒక సినిమా చేసినా అది రికార్డ్లు తిరగ రాసే సినిమా అవుతుంది.  దంగల్, ౩ ఇదియట్స్, పీకే, రంగ్ డే బసంతి మొదలైన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి.  అయితే తగ్స్ అఫ్ హిందోస్తాన్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది.  ఆమిర్ ఖాన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపాయింది.  ఈ సినిమా పై ఎన్నో మేమ్స్. ట్రోల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.  అయితే ఆమిర్-ముఖేష్ అంబాని తో కలిసి త్వరలో వెయ్యి కోట్ల బడ్జెట్ లో మహాభారతాన్ని వెబ్ సిరీస్ గా తెరకేక్కుస్తున్నారట.  ఏడు భాగాలుగా సాగే ఈ వెబ్ సిరీస్ లో ఆమిర్ కృష్ణుడి పాత్ర లో నటించడం విశేషం.  ఒక్కొక్క సిరీస్ కి ఒక్కో దర్శకుడు ప్రెజెంట్ చేస్తారు.