పిల్లలు కాదు... విమానం దొంగలు....

అమెరికాలోని యుటా రాష్ట్రంలోని వాసాట్చ్ ఫ్రంట్ ప్రాంతంలో ఒక గ్రూప్ హోం లో వుండే 14-15 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుర్రాళ్లు  ఆ ప్రాంతానికి చెందిన తమ స్నేహితులతో తాము నివసించే తూర్పు యుటాహ్‌లోని జెన్‌సెన్ ప్రాంతానికి వెళ్ళారు.. జేన్సెన్ ప్రాంతంలో  వారు ఒక ట్రాక్టర్‌ను సంపాదించి, దగ్గర్లోని ఓ ప్రైవేటు రన్‌వే పైకి వెళ్లి, అక్కడున్న ఫిక్స్డ్ వింగ్ సింగిల్‌ ఇంజిన్‌ తేలికపాటి స్పోర్ట్స్ విమానాన్ని దొంగిలించి, వెర్నెల్‌ ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు.  ఆ విమానాన్ని వాసాట్చ్ కు తిరిగి తీసుకు వెళదాం అనుకున్నా, మనసు మార్చుకుని అక్కడే ల్యాండ్ చేసారు.    ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ సంఘటన సోషల్ మీడియా లో వైరల్ ఐంది.. ఈ పిల్లలకి విమానం నడపడం ఎలా సాధ్యమయ్యింది చెప్మా అంటూ... పోలీసులు.. నెటిజనులు..హాస్చర్య పోతున్నారు...