వివాదాస్పద బాల సాయి హైదరాబాద్ లో గుండెపోటు తో మరణం

కర్నూలు జిల్లాకు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా (58) హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.  లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఆశ్రమంలో బాలసాయిబాబాకు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రాగా, సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

బాలసాయిబాబా స్వస్థలం కర్నూలు.   1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి 18 ఏళ్లకే తొలి ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు.  తాను మెడిసిన్లో, తత్వ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసానని, రాయిపూర్ లోని కళింగ యునివర్సిటీ లో వైస్ చాన్సిలర్ గా పనిచేశానని, ఐదు పీ హెచ్ డీలు చేసానని చెప్పుకునేవారు.  అయితే 10 వ తరగతి తోనే చదువును ఆపెసారనే కథనం ప్రచారంలో వుంది.  అంతే కాదు, 1980 లో కాంపౌండర్ గా, డాన్స్ మాస్టర్ గా కూడా పనిచేసాడు.  సాయి కుటుంబం కేరళ నుంచి వచ్చి కర్నూలో స్థిరపడ్డారు.  కర్నూల్ నెహ్రు మెమోరియల్ స్కూల్ లో చదువుకున్న బాలసాయి,  పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.  తన ఇంటి దగ్గరే ఒక సాయిబాబా గుడి వుండడం, ఆధ్యాత్మిక వాతావరణంలో  పెరిగారు బాలసాయి.    తదుపరి, తన స్నేహితుల సహకారంతో తనకు తనకు తానే బాబా గా ప్రకటించుకున్నారు.  బాలసాయి కి కర్నూల్, హైదరాబాద్ ల లో ఆశ్రమాలు వున్నాయి.  శివరాత్రి రోజున తన కడుపులోంచి శివ లింగాలు తీయడం వివాదాస్పదం అయ్యింది.  అనేక హిందూ సంస్థలు అతను కేవలం ఒక ఇంద్రజాలికుడనీ, అతనికి ఎలాంటి మహిమలు లేవని ఆరోపించాయి.  బాలసాయి పై పలు వివాదాలు, కేసులు వున్నాయి.  విదేశాలనించి భారీ గా విరాళాలు సేకరించి, ఆస్తులు సంపాదించారనే అభివాదం కూడా వుంది.   ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా భక్తులు ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా.. తనకు తాను అవతారంగా ప్రకటించుకుని భక్తులకు బోధనలు చేస్తూ... జీవితం గుడుపుతున్నారు.   

 

హైదరాబాద్‌ నుంచి ఆయన పార్థీవదేహాన్ని కర్నూలుకు తరలించి కర్నూలులోని బాలసాయి ఆశ్రమంలో ఆయనను మహాసమాధి చేయనున్నట్టు భక్తులు తెలిపారు.