‘భాగ‌మ‌తి’ థీమ్ సాంగ్ రిలీజ్

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన థ్రిల్ల‌ర్ మూవీ ‘భాగ‌మ‌తి’. అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జ‌య‌రామ్‌, ఉన్ని ముకుంద‌న్‌, ఆశా శ‌ర‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇంగ్లీష్ లో డిజైన్ చేశారు. ఇది హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమా. గ‌త జ‌న్మ‌ల నేప‌థ్యాలూ ఈ క‌థ‌లో మిళితం చేశాడు ద‌ర్శ‌కుడు అశోక్‌. ‘భాగమతి’ గెటప్ లో అనుష్క కనిపించిన తీరు .. ఆమె డైలాగ్ డెలివరీ మరింతగా కుతూహలాన్ని కలిగిస్తున్నాయి. యువి క్రియేష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.