తెలుగు దేశానికి పూర్వ వైభవం తెద్దాం: బాలకృష్ణ

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ కి పునర్వైభవం తీసుకొద్దాం అన్నారు హిందూపూర్ ఎం ఎల్ ఎ, నందమూరి బాలకృష్ణ.  ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని తెరాసా, ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేసిందనీ బాలకృష్ణ విమర్శించారు.    కూకట్ పల్లి నియోజవర్గంలోని బోయినపల్లిలో తెదేపా అభ్యర్థి, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, నందమూరి సుహాసినికి మద్దతుగా బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించారు. పెత్తందారుల వ్యవస్థను తీసుకురావాలని తెరాస ప్రయత్నిస్తోందని,

తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనబడుతోందని, తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొద్దామన్నారు.  తెలుగుదేశం అందరి పార్టీ అని, హైదరాబాద్‌ నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం అని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే పార్టీ అని చెప్పారు.   ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే ఉందనీ, కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి ప్రజాకూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని బాలకృష్ణ కోరారు.