పూర్తి భాద్యత నాదే: ఆమిర్ ఖాన్

భారీ తారాగణం తో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’  అనూహ్యంగా అపజయాన్ని చవి చూసింది.  ఈ చిత్రం విడుదలై ౩ వారాలు ఐంది.  ముంబాయి లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ సినిమా అపజయం పాలు అయినందుకు తనను క్షమించాలని కోరారు. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రీనా కైఫ్ వంటి భారీ తారాగణం తో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్’ ఊహించని రీతిలో బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.  ఈ చిత్రం ఫ్లాప్‌ అవడంలో పూర్తి బాధ్యత తనదేనని ఆమిర్‌ వెల్లడించారు.   ‘‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్ధాన్‌’ సినిమా ఫ్లాప్‌ అవడంపై పూర్తి బాధ్యత నాదే.  కానీ మేం సాయశక్తులా కృషి చేసాం.  సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులకి మా ధన్యవాదాలు.  ఎన్నో అంచనాలతో వచ్చిన ప్రేక్క్షకులని మేము వినోదాన్ని పంచలేక పోయాం.  వారిని నిరాశపరిచాను. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదు? అనే విషయం గురించి నేను పబ్లిక్‌గా మాట్లాడదలచుకోలేదు. ఈ సినిమా నా బిడ్డలాంటిది. అది విఫలమైంది కాబట్టి నేనూ విఫలమైనట్లే.  నా తర్వాతి సినిమాకు మరింత కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను’ అన్నారు ఆమిర్.  తొలి రోజే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించినా, నెగటివ్ టాక్ వాళ్ళ తర్వాతి రోజులలో ఈ సినిమా డీలా పడింది.  మొదటివారంలో 135కోట్లు వసూలు చేసినా, తర్వాతి వారంలో కేవలం రూ 8.79 కోట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.