ఎన్నికల అధికారి నోట ‘నోటా’ మాట: 

రాష్ట్రంలోని చదువుకున్న మేధావులు, యువత తప్పనిసరిగా వోటు హక్కు వినియోగించుకొని, రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ పిలుపునిచ్చారు.   నాంపల్లిలోని ఫ్యాప్సీలో నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.  తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 2.81 కోట్లకు చేరిందని, ఇప్పటివరకు తమ వోటు హక్కును నమోదు చేసుకొని వారంతా కనీసం రానున్న జనవరిలో నమోదు చేసుకోవాలని అయన అన్నారు.  ఎన్నికల సమరంలో వున్న అభ్యర్థుల పట్ల ఎవరికినా అసంతృప్తి ఉన్నట్లయితే ‘నోటా’ ఎంపిక చేసుకోవచ్చనీ ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  నోటా (NOTA – None Of The Above) – అంటే పైన వున్నా ఏ ఒక్క అభ్యర్థి కి నేను వోటు వేయడం లేదు అని అర్థం.  ఈ ఆప్షన్ ని కూడా ఓటరు వాడుకోవచ్చు.